భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పరిధి అభయాంజనేయస్వామి ఉపాలయాన్ని మంగళవారం కూల్చివేశారు. ఆల య అభివృద్ధిలో భాగంగా ఈ ఉపాలయాన్ని పునర్ నిర్మించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం జీర్ణోద్ధరణ, కళావాహన పూజలు చేసి మూలమూర్తులను రంగనాయకుల గుట్టపైకి చేర్చారు. ఇక కూల్చివేత పూర్తిచేయడంతో ప్రధానాలయం, రాజ గోపురం మినహా నాలుగు వైపులా ప్రాకారా లు, ఉపాలయాల తొలగింపు పూర్తయింది. కాగా, ఇదే ప్రదేశంలో రామకోటి స్తంభాలను మాత్రం యథాతధంగా ఉంచనున్నారు.
పనులను పరిశీలించిన ఈఓ..
ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రామాలయం ఈఓ దామోదర్‌రావు సూచించారు. దేవస్థానంలో అభయాంజనేయస్వామి ఆలయం తొలిగింపు ఇతర పనులను ఈఓ మంగళవారం పరిశీలించారు. అనంతరం పనులపై కాంట్రాక్టర్‌కు సూచనలు చేశారు.


