బూర్గంపాడు: వాహనాలు తనిఖీ క్రమాన బూర్గంపాడు పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు ఎస్‌ఐ నాగభిక్షం ఆధ్వర్యాన మార్కెట్ యార్డు వద్ద మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ మేరకు మోటార్‌సైకిల్‌పై రెండు బ్యాగులతో వెళ్తున్న ఇద్దరికి తనిఖీ చేయగా రూ.9.33లక్షల విలువైన 18.600 కిలోల గంజాయి లభించింది. పట్టుబడిన వారు కర్ణాటకకు చెందిన నవీన్‌కుమార్, విజయకుమార్‌గా గుర్తించగా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి తీసుకెళ్లున్నట్లు తేలింది. వీరిద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ మేడ ప్రసాద్ తెలిపారు.
మోసం చేశాడని
కానిస్టేబుల్‌పై ఫిర్యాదు
పాల్వంచరూరల్: ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆతర్వాత ముఖం చాటేశాడని మంగళవారం ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాల్వంచ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఓ యువతిని పాల్వంచ రూరల్ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ తనను మోసం చేశాడని ఫిర్యాదులో వెల్లడించింది.


