ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని వెల్‌నెస్ సెంటర్‌ను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. హైదరాబాద్ నుండి వచ్చిన ట్రస్ట్ జనరల్ మేనేజర్ డాక్టర్ నరేష్, విజిలెన్స్ ఆఫీసర్ నారాయణరెడ్డి, డిప్యూటీ ఈఓ బి.శ్రీనివాస్ వెల్‌నెస్ సెంటర్‌లోని ఓపీతో పాటు ల్యాబ్, మందులు ఇచ్చే గదిని పరిశీలించారు. ఇటీవల సెంటర్‌లో మందులు సక్రమంగా ఇవ్వడం లేదనే ఫిర్యాదులు రావడంతో వివరాలు ఆరా తీశారు. మందుల లభ్యత ఆధారంగా ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టాలని సిబ్బందికి సూచించారు. అలాగే, ఇటీవల సెంటర్‌లోని మహిళా వైద్యులు, సిబ్బందిని డెంటల్ వైద్యుడు వేధించాడనే ఆరోపణలపై కూడా వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డిరేటర్ పి.సతీష్, జిల్లా మేనేజర్ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.


