భద్రాచలంఅర్బన్: భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో వరుసగా మోటార్‌సైకిళ్ల దొంగతనా లకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ఎం.అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకా రం.. కొంతకాలంగా భద్రాచలంలో బైక్‌లు చోరీకి గురవుతున్నట్లు ఫిర్యాదులతో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమాన టౌన్ ఎస్సై బి.రామకృష్ణ, సిబ్బంది సోమవారం కూనవరం రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టగా సారపాక గాంధీనగర్‌కు చెందిన గుగులోత్ శ్రీను బైక్‌పై వస్తూ కనిపించాడు. వాహనానికి సంబంధించి పత్రాలు లేకపోవడంతో విచా రించగా భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో బైక్‌లను చోరీ చేసినట్లు అంగీకరించాడు. గతంలోనూ శ్రీనుపై కేసులు ఉండగా, నాలుగు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించి నట్లు డీఎస్పీ తెలిపారు. ఈసమావేశంలో భద్రాచలం సీఐ నాగరాజు, ఎస్‌ఐ రామకృష్ణ, ఏఎస్‌ఐ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.


