అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలను మంగళవారం వివిధ ప్రాంతాల విద్యార్థులు, దేవీ డీలర్ల బృందం వేర్వేరుగా సందర్శించారు. అశ్వారావుపేటలోని వీకేడీవీ జూనియర్ కళాశాలకు చెందిన 80 మంది ఇంటర్ సెకండియర్ విద్యార్థులు, మహబూబాబాద్ జిల్లాకు చెందిన 40 మంది దేశీ డీలర్ల బృందం కళాశాలను సందర్శించగా.. ఉద్యాన పంటలు, సాగు విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. వీరికి కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ నీలిమ, డాక్టర్ రాములు, డాక్టర్ శివ అవగాహన కల్పించారు.
జాతీయస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన, కొమరోజు శ్రీరామ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రతిభ చూపి డెహ్రాడూన్‌లో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. కేరళ త్రివేండ్రంలో నిర్వహించిన సౌత్‌జోన్ రైఫిల్ పిస్టల్ షూటింగ్ పోటీల్లో ప్రతిభ చాటిన వీరిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. క్రీడాకారులు, కోచ్ ఎం.డీ.నబీని డీవైఎస్‌ఓ ఎం.పరంధామరెడ్డి మంగళవారం అభినందించారు.
సాహసవీరుడికి
పురస్కారం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని నారంవారిగూడెం కాలనీ గ్రామానికి చెందిన సాహసవీరుడు భూక్యా కృష్ణనాయక్‌కు మరో పురస్కారం దక్కింది. ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రానికి చెందిన ఎం.వీ.రావు ఫౌండేషన్ ఆధ్వర్యాన వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులకు అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా సాహస విన్యాసాలు చేయడంతో పాటు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్న కృష్ణను ఎంపిక చేయగా, సంస్థ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్‌కృష్ణ పురస్కారం అందజేశారు.


