మండలంలో సీతారామ ప్రాజెక్టు కెనాల్ నిర్మాణానికి తవ్వకాలు చేపట్టి తీసిన మట్టిని పక్కనే గుట్టలుగా పోశారు. ఆ గుట్టలపై పెరిగిన తెల్లటి రెల్లుగడ్డి మంచు కొండలను తలపిస్తూ
చూపరులను ఆకట్టుకుంటోంది. ఇటీవల వర్షాలకు మట్టి గుట్టలపై దట్టంగా పెరిగిన రెల్లుగడ్డి తెల్లటి పుష్పాలతో కమ్మేయడంతో గాలి వీచినప్పుడల్లా పూల గుత్తులు అలల మాదిరిగా
ఊగుతున్నాయి. మట్టి గుట్టలకు ప్రకృతి సహజసిద్ధంగా అందాన్ని అద్దడంతో వాహనదారులు, స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. – అశ్వాపురం


