క్రీడలతో ఉత్సాహం.. ఉల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఉత్సాహం.. ఉల్లాసం

Aug 30 2026 12:39 AM | Updated on Aug 30 2026 12:39 AM

పాల్వంచరూరల్‌: క్రీడా పోటీలు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ అన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా శనివారం కిన్నెరసాని స్పోర్ట్స్‌ స్కూల్‌ మైదానంలో రెండు రోజులపాటు జరగనున్న ఐటీడీఏ ఉద్యోగులు, ఉపాధ్యాయుల క్రీడాపోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తొలిరోజు పోటీ ల్లో పురుషుల వాలీబాల్‌లో పీఎంఆర్‌సీ జట్టు ప్రథ మ, బీసీఎం జట్టు ద్వితీయ స్థానాలు సాధించాయి. మహిళ విభాగంలో బీసీఎం ప్రథమ, దమ్మపేట ద్వితీయ స్థానాలను గెలుచుకున్నాయి. టెన్నీ కాయిట్‌ పోటీల్లో బీసీఎం జట్టు ప్రథమ, దమ్మపేట జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. అనంతరం పాల్వంచ చేరుకున్న పీఓ రాత్రి జెన్‌ కో ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ ఆడి ప్రతిభ చూపారు. తొలుత విశ్వవిఖ్యాత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌ చంద్‌ చిత్రపటానికి పీఓ పూలమాల వేసి నివాళులర్పించారు. డీడీ చందన, గోపాల్‌రావు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement