సింగరేణి జీఎం(ఫైనాన్స్ అకౌంట్స్) చక్రవర్తి
మణుగూరుటౌన్: కార్మికులు, అధికారులు పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేస్తూ ఉత్పత్తి, ఉత్పాదకతను పెంపొందించాలని సింగరేణి జీఎం(ఫైనాన్స్ అకౌంట్స్) ఎన్. చక్రవర్తి అన్నారు. శనివారం మణుగూరు ఏరియాలో ఆయన పర్యటించారు. ఈ నెలాఖరున ఆయన ఉద్యోగ విరమణ పొందనుండగా ఏరి యా అధికారులు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇన్‌చార్జి జీఎం వెంకట రామారావు, అధికారులు రాంబాబు, రమేశ్, మదన్ నాయ క్, శ్రీనివాసచారి, నాగరమేశ్, దయాకర్, శివ ప్రసాద్, పి.రమేశ్ పాల్గొన్నారు.
ధ్యాన్‌చంద్‌కు నివాళి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు 2కే రన్ నిర్వహించారు. రైల్వేస్టేషన్ ఆవరణలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగూడెంలోని బృందావనం ప్రాంతంలో సుమా రు 18ఎకరాల విస్తీర్ణంలో సమగ్ర క్రీడా ప్రాంగణం నిర్మించేందుకు స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. అనంతరం క్రీడాకారులను మెడల్స్‌తో, కోచ్‌లను శాలువాలతో సత్కరించారు. కొత్తగూడెం మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి ఎం.పరంధామరెడ్డి, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు మహీధర్, కాశీహుస్సేన్, రమేష్, రామిరెడ్డి, వై.వెంకటేశ్వరరావు, సాయినిరంజన్, వివిజి కృష్ణ, కళ్యాణ్, సత్యనారాయణ, నవీన్, ఇమామ్, పీడీ నరేష్ పాల్గొన్నారు.
ఆర్థిక సాధికారతే
ధ్యేయం
కరకగూడెం: మహిళా సంఘాల ఆర్థిక సాధికా రతే ధ్యేయంగా పనిచేయాలని సెర్ప్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు సురేష్ రెడ్డి, సమ్మక్క, నర్మదారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని స్వ యం శక్తి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శనివారం వీఓఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, రుణాల చెల్లింపు తదితర అంశాలపై సమీక్షించారు. సభ్యుల కుటుంబాలను ఆర్థికంగా సుస్థిరత వైపు నడిపించాలని సూచించారు. ఎంపీడీఓ శ్రీనివాస్, సిబ్బంది వినోద్‌క్రాంతి, సరస్వతి, సత్యనారాయణ పాల్గొన్నారు.
సర్ ప్రక్రియ
వేగవంతం చేయాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో నోటీసుల జారీ, పరిష్కార చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కానీ ఓటర్లకు సంబంధించి నోటీసులు జారీ చేశామని తెలిపారు. నోటీసుల హియరింగ్ ప్రక్రియ పూర్తి చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పేట పరిశోధనా కేంద్రంలో ఉద్యాన బీఎస్సీ..
అశ్వారావుపేట: కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్సిటీ పరిధిలోని అశ్వారావుపేట ఉద్యాన పరిశోధనా కేంద్రంలో ఉద్యాన కళాశాల ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఉద్యాన బీఎస్సీ అడ్మిషన్ ప్రక్రియ కూడా జరుగుతోందని, మొదటి బ్యాచ్‌లో 30మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త మజ్జిగ శ్రీనివాస్ తెలి పారు. కాగా, తొలుత అశ్వారావుపేట వ్యవసా య కళాశాలలో, ఉద్యాన పరిశోధనా కేంద్రంలో బీఎస్సీ హార్టికల్చర్ కోర్సు నిర్వహించేందుకు సన్నాహాలు జరిగాయి. ఈ క్రమంలో వ్యవసాయ కళాశాలలో అడ్మిషన్లు స్వీకరించొద్దని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అశ్వారావుపేటలో ఉద్యాన కోర్సు రద్దయిందనే అపోహ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ కళాశాలలో మాత్రమే కోర్సు రద్దయిందని, ఉద్యాన పరిశోధన కేంద్రంలో కోర్సు కొనసాగుతుందని అధికారులు స్పష్టతనిచ్చారు.


