భక్తులు మెచ్చేలా పుష్కరాల పనులు | - | Sakshi
Sakshi News home page

భక్తులు మెచ్చేలా పుష్కరాల పనులు

Aug 30 2026 12:39 AM | Updated on Aug 30 2026 12:39 AM

భద్రాచలం: వచ్చేఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. భద్రాచలం గోదావరి కరకట్ట వద్ద పుష్కరాల పనులకు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుష్కరాలకు మూడు విడతలుగా పనులు జరగనున్నాయని తెలి పారు. తొలి విడత పనులకు రు.46.65కోట్లు, రెండో విడతకు రూ.1.75కోట్లు, మూడో విడతకు రూ.60 లక్షలు.. మొత్తం రు.49కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కరకట్ట కింది భాగంలో సర్వీస్‌రోడ్డు, స్నానఘాట్‌, మరుగుదొడ్లు తదితర వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రామాలయ ఈఓ దామోదర్‌రావు, ఇరిగేషన్‌ అధికా రులు శ్రీనివాస్‌ రెడ్డి, మహేశ్వర రావు, భాగ్యరాజ్‌, జానీ, సర్పంచ్‌ పూనెం కృష్ణ, పంచాయతీ ఈఓ శ్రీని వాస్‌, తహసీల్దార్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.

వేగవంతంగా గోదావరి పుష్కరాల పనులు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పుష్కర ఘాట్ల వద్ద సదుపాయాల కల్పన పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై హైదరాబాద్‌ నుంచి శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమినర్‌ హనుమంతరావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ పార్కింగ్‌, రోడ్డు వసతి, అత్యవసర ఎగ్జిట్‌ వంటి వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అప్రోచ్‌ రోడ్లు, మరమ్మతులు ప్రాధాన్యతాక్రమంలో చేపడుతున్నట్లు తెలిపారు.

పనుల ప్రారంభోత్సవంలో

ఎమ్మెల్యే వెంకట్రావు, కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement