కేటీపీఎస్‌ మరమ్మతుల్లో తీవ్ర జాప్యం | - | Sakshi
Sakshi News home page

కేటీపీఎస్‌ మరమ్మతుల్లో తీవ్ర జాప్యం

Aug 30 2026 12:39 AM | Updated on Aug 30 2026 12:39 AM

● సాంకేతిక సమస్యతో 7వ దశలో నిలిచిన విద్యుదుత్పత్తి ● ఎకై ్సటర్‌ రోటర్‌ హరిద్వార్‌ నుంచి తెప్పించనున్న అధికారులు

● సాంకేతిక సమస్యతో 7వ దశలో నిలిచిన విద్యుదుత్పత్తి ● ఎకై ్సటర్‌ రోటర్‌ హరిద్వార్‌ నుంచి తెప్పించనున్న అధికారులు

పాల్వంచ: కేటీపీఎస్‌ 7వ దశ మరమ్మతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కర్మాగారంలో ఈ నెల 16న సాంకేతిక సమస్యతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. యూనిట్‌ రన్నింగ్‌లో ఉండగానే జనరేటర్‌లోని సాంకేతిక సమస్య తలెత్తి అందులోని బ్లేడ్‌లు అన్ని పేలిపోయాయి. బీహెచ్‌ఈఎల్‌ అధికారులు వచ్చి పరిశీలించి దెబ్బతిన్న ఎకై ్సటర్‌ రోటర్‌ను హరిద్వార్‌లోని తమ యూ నిట్‌కు తరలించి మరమ్మతులు చేయాలని తొలుత భావించారు. అందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో కొత్త ఎకై ్సటర్‌ను అమర్చేలా చర్యలు చేపట్టారు. దీని విలువ రూ.21 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

రోజుకు 19.2 మిలియన్‌ యూనిట్ల నష్టం

నిత్యం 19.2 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అందక పోవడంతో జెన్‌కోకు రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోంది. కొత్త రోటర్‌ను మరో రెండు రోజు ల్లో హరిద్వార్‌ నుంచి తెచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడికి వచ్చాక అమర్చి ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురావడానికి మరో పది రోజుల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై సీఈ శివరామ్‌ రెడ్డిని వివరణ కోరగా.. కొత్త ఎకై ్సటర్‌ టెస్టింగ్‌ ప్రక్రియ నడుస్తోందని, త్వరలోనే తెప్పించి అమర్చుతామని, అప్పటివరకు ఇతర విభాగాల్లో మరమ్మతులు నిర్వహిస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement