రాష్ట్రపతితో ‘ఏకలవ్య’ విద్యార్థుల రాఖీ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతితో ‘ఏకలవ్య’ విద్యార్థుల రాఖీ వేడుకలు

Aug 30 2026 12:39 AM | Updated on Aug 30 2026 12:39 AM

టేకులపల్లి: రక్షాబంధన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అరుదైన అవకాశం ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల(ఈఎంఆర్‌ఎస్‌) విద్యార్థులకు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య పాఠశాలల నుంచి 10మంది చొప్పున బాలికలు, బాలురు 20 మందిని ఎంపిక చేయగా, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం జరిగిన రాఖీపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ బృందంలో జిల్లాలోని టేకులపల్లి ఏకలవ్య పాఠశాలకు చెందిన విద్యార్థి తేజావత్‌ హే మంత్‌కు స్థానం దక్కింది. టేకులపల్లి విద్యార్థి హేమంత్‌కు రాష్ట్రపతిని కలిసే అవకాశం దక్కడంపై ప్రిన్సిపాల్‌ నిశాంత్‌ కృష్ణవ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement