సూపర్‌బజార్(కొత్తగూడెం): పదోన్నతిపై న్యా యమూర్తిని బదిలీ చేస్తూ హైకోర్టు నుంచి శని వారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగూడెం జిల్లా కోర్టులోనాలుగు నెలలుగా ప్రిన్సి పల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న హైమ పూజితను హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ చేశారు.
అభివృద్ధి పనుల పరిశీలన
భద్రాచలం: భద్రాచలంలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను ఇంజనీర్ల బృందం శనివారం పరిశీలించింది. దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ శశిధర్, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ బీవీరావు రంగనాయకుల గుట్ట, పడమర మెట్ల వైపు జరుగుతున్న పనులపై సమీక్షించారు. స్టీల్ డిజైన్‌లు, ఫౌండేషన్‌ల మార్పులు, చేర్పులను సంబంధిత అధికారులకు సూచించారు. ఈఈ రవీందర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వచ్చే నెల
20 నుంచి క్రీడా పోటీలు
రుద్రంపూర్: సింగరేణి యాజమాన్యం సెప్టెంబర్ 20 నుంచి నవంబర్ 20 వరకు పలు తేదీ ల్లో కార్మికులకు క్రీడా పోటీలు నిర్వహించనుంది. ఇందుకోసం రూ.1.35 కోట్ల నిధులు కేటా యించింది. వివిధ పోటీలను సంస్థవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు పర్సనల్ (వెల్ఫేర్ అండ్ సీఎస్సార్) విభాగం కె.అజయ్ కుమార్ తెలిపారు.
స్పోర్ట్స్ అధికారి లేకుండానే...
సింగరేణిలో 2015లో సింగరేణి స్పోర్ట్స్ ఆఫీస ర్ ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి స్పోర్ట్స్ అధికారిని నియమించలేదు. మరో ఆరు నెలల్లో కార్పొరేట్ సూపర్ వైజర్ కూడా ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి స్పోర్ట్స్ ఆఫీసర్‌ను నియమించాలని కార్మికులు కోరుతున్నారు.
గుంపెనవాసికి
బంగారు పతకం
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): తెలంగాణ రైఫిల్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో ఇబ్రహీంపట్నంలోని ఆక్టోపస్ కమాండో శిక్షణ కేంద్రంలో నిర్వహించిన సూపర్ బిగ్ బోర్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో జూనియర్ షూటర్ అయ్మాన్ ముస్కాన్ పఠాన్ బంగారుపతకం సాధించి సత్తా చాటారు. జూనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో 98 పాయింట్లతోఅత్యధిక స్కోర్ నమోదు చేశారు. మాజీ డీజీపీ అంజనీ కుమార్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకోగా, పలువురు అభినందించారు.


