భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఆలయానికి మూడు వైపులా ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు. కంచర్ల గోపన్న నిర్మించిన ప్రధానా లయం మినహా ఇతర అన్ని చోట్ల పనులు చేపడుతున్నారు. గతంలో అంతరాలయం చుట్టూ ఉపాలయాలు, షెడ్‌ల నిర్మాణంతో ప్రధానాలయం పూర్తి గా కనిపించేది కాదు. ప్రస్తుతం చుట్టు నిర్మాణాలు తొలగించడంతో ఎన్నడూ చూడని రామాలయ దృశ్యాలు భక్తులకు దర్శనం ఇస్తున్నాయి. పడరమ ప్రధాన గోపురం, కంచర్ల గోపన్నకాలం నాటి ప్రధానాలయం, రంగనాయకుల గుట్టపై నుంచి ఆలయ ప్రధానాలయం వంటి అరుదైన చిత్రాలను ‘సాక్షి’ బంధించింది.


