● ఎస్పీ రోహిత్‌రాజు ● ఎన్‌డీపీఎస్ కేసుల దర్యాప్తుపై శిక్షణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని నిరోధించాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. ఎన్‌డీపీఎస్ కేసుల దర్యాప్తుపై పోలీసు అధికారులకు, సిబ్బందికి శనివారం కొత్తగూడెం ఐఎంఏ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. స్పెష ల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈగల్ ఫోర్స్ ఎల్‌హెచ్ రాజేశ్వరరావు విక్షణ ఇచ్చారు. నిందితుల గుర్తింపు, అరెస్టు, సీజ్ ప్రక్రియ, పంచనామా, సాక్ష్యాల సేకరణ, కేసు దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు తదితర అంశాల్లో పాటించాల్సిన చట్టపరమైన విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్‌డీపీఎస్ చట్టంలోని వివిధ సెక్షన్లు, అమలు విధానం, కోర్టు విచారణ సమయంలో ఎదురయ్యే అంశాలు, దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాక్ష్యాధారాల పరిరక్షణ తది తర అంశాలను వివరించారు. డ్రగ్స్ అక్రమ రవా ణా, వినియోగాన్ని అరికట్టేందుకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. దర్యాప్తులో చట్టపరమైన నిబంధనలను పాటించాలని అన్నా రు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎల్‌హెచ్ రాజేశ్వరరావు, ఫణికుమార్‌లను ఎస్పీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఆదినారాయణ, సతీష్ కుమార్, రవీందర్ రెడ్డి, వెంకన్న బాబు, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.


