భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరి నది మధ్యలో మోతె నుంచి చిన్నంపేటకు వచ్చే విద్యుత్ టవర్ లైన్ తెగిపోయింది. దీంతో ఎటపాక 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి విద్యుత్ సరఫరా కాలేదు. ఫలితంగా భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై గోదావరి నదిలోకి దిగి తెగిపోయిన టవర్ లైన్ వద్ద మరమ్మతులు చేపట్టారు. నీటి ప్రవాహాన్ని లెక్కచేయకుండా టవర్ వద్దకు చేరుకుని విద్యుత్ లైన్ పునరుద్ధరించారు. సాహసోపేతంగా పనిచేసిన వారిని పలువురు అభినందించా రు. కాగా, మరమ్మతులు పూర్తయ్యే వరకు మణుగూరు, వెంకటాపురం లైన్ నుంచి భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు విద్యుత్ సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు.


