తాలిపేరుకు వరద ఉధృతి | - | Sakshi
Sakshi News home page

తాలిపేరుకు వరద ఉధృతి

Aug 20 2026 12:17 AM | Updated on Aug 20 2026 12:17 AM

చర్ల: తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్‌కు మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు వరద వస్తుండటంతో 4 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి ఉంచి 5,644 క్యూసెక్కుల చొప్పున నీటిని ప్రాజెక్ట్‌ నుంచి గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా, 73.67 మీటర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు. కుడి ప్రధాన కాలువ ద్వారా 25 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 210 క్యూసెక్కుల సాగునీటిని పంట పొలాలకు విడుదల చేస్తున్నారు.

402.40 అడుగులకు కిన్నెరసాని

పాల్వంచరూరల్‌: కిన్నెరసాని నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం పూర్తి నీటి నిల్వసామర్థ్యం 407 అడుగులు కాగా, బుధవారం 402.40 అడుగులుగా నమోదైంది. వర్షాలకు జిల్లాలో ఇప్పటివరకు 421 చెరువులు నీటితో నిండాయని జలవనరులశాఖ సీఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిగతా చెరువుల్లోకి వివిధ దశల్లో నీరు చేరిందని పేర్కొన్నారు.

సులానగర్‌

పీహెచ్‌సీ తనిఖీ

టేకులపల్లి: సులానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌ తనిఖీ చేశారు. వివిధ విభాగాలను పరి శీలించారు. రోగులతో మాట్లాడి వసతులు, వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. అదే సమయంలో జ్వరంతో వచ్చిన బాలుడిని డీఎంహెచ్‌వో పరీక్షించా రు. అధికారులు ప్రతాప్‌, కంచర్ల వెంకటేష్‌, నాగభూషణం, సీతమ్మ, మోహన్‌, చంద్రకళ, పున్నమయ్య, సూపర్‌వైజర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడెంలో...

చుంచుపల్లి: కొత్తగూడెంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులను డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ బుధవారం తనిఖీ చేశారు. వి.కేర్‌ ఆస్పత్రిలో అందుతున్న సేవలు, వైద్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబందనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఐకేర్‌, ఆప్టికల్స్‌లో తనిఖీ

మణుగూరు టౌన్‌: పట్టణంలోని ఐకేర్‌, ఆప్టికల్స్‌ను క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ప్రోగ్రాం ఆఫీస ర్‌ డాక్టర్‌ రాందాస్‌ బుధవారం తనిఖీలు చేపట్టారు. రికార్డులు, రిజిస్టర్లు, ఇతర పత్రాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్‌ లేకుండా నడుపుతున్న ఆప్టికల్స్‌కు నోటీసులు అందజేశారు. ఈ తనిఖీలో అధికారులు నాగలక్ష్మి, బేబీ, జూని యర్‌ అసిస్టెంట్లు శ్రీధర్‌, ప్రసాద్‌, మనోజ్‌ పాల్గొన్నారు.

కొర్రమీను పెంపకంతో ఆదాయం

ములకలపల్లి: కొర్రమీను చేపల పెంపకంతో అధిక ఆదాయం గడించవచ్చని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ డిప్యూటీ కమిషనర్‌ జాన్‌ వెస్లీ సూచించారు. మండలపరిధిలోని చౌటిగూడెం కాలనీలో దివ్య సంఘం సభ్యురాలు వాడే రజిత ఏర్పాటు చేసిన పెంపకం యూనిట్‌ను బుధవారం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీలు కుటీర పరిశ్రమలు, ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. ఫారమ్‌పాండ్స్‌ నిర్మాణ లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని ఏపీఎం రామ్‌కుమార్‌ను ఆదేశించారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఆర్‌డీఓ విద్యాచందన, డీపీఓ అనూష, ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీఓ రమేష్‌బాబు, ఏపీఓ హుస్సేన్‌, సర్పంచ్‌ తానం పద్మ తదితరులు పాల్గొన్నారు.

కోర్టుకు హాజరైన

మాజీ ఎంపీ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పాల్వంచ పట్టణ పోలీసుస్టేషన్‌లో 2014లో నమోదైన కేసుకు సంబంధించి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుపై వారంట్‌ జారీ అయింది. దీంతో రీ కాల్‌ కోసం బుధవారం ఆయన కొత్తగూడెం మూడో అదనపు జ్యుడీషియల్‌ మొదటి శ్రేణి న్యాయస్థానంలో హాజరయ్యారు. అంతేకాక 2018 ఎన్నికల సందర్భంగా అన్నపురెడ్డిపల్లి పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో వారంట్‌ రీకాల్‌ కోసం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సైతం కొత్తగూడెం కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు పలువురు వారిని కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement