ఏకలవ్యలో సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఏకలవ్యలో సమస్యలు పరిష్కరించాలి

Aug 20 2026 12:17 AM | Updated on Aug 20 2026 12:17 AM

గుండాల: మండలంలోని ముత్తాపురం ఏకలవ్య పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. పాఠశాల వద్ద మంగళవారం సాయంత్రం నుంచి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమతులు లేకుండా పాఠశాలలో తీజ్‌ పండుగను నిర్వహించిన ఔట్‌ సోర్సిగ్‌ ఉపాధ్యాయులు, గేట్‌ కీపర్‌ను కూడా తొలగించాలని, నిబంధనలను ఉల్లంఘించిన ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, సిబ్బందిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. విద్యార్థుల మెనూ విషయంలోనూ వర్గాల వారీగా, వేర్వేరుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రిన్సిపాల్‌, సిబ్బంది భాష సమస్యలతో ఆదివాసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థలం కేటాయించిన దాతలకు ఉద్యో గం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాగా బుధవారం పాఠశాలను సందర్శించిన ఆర్‌సీఓ అరుణకుమారి ఆదివాసీ నాయకులు, విద్యార్థులతో చర్చించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, విచారణ చేపడతా మని హామీ ఇచ్చారు. ఆందోళనలో ఆదివాసీ 9 తెగల జేఏసీ చైర్మన్‌ చుంచ రామకృష్ణ, సర్పంచ్‌లు రాదా, రజిత, నాయకులు కొడెం వెంకటేశ్వర్లు, రమణమాబు, నాగరాజు, మహెందర్‌, వీరస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement