జయశంకర్‌ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

జయశంకర్‌ సేవలు చిరస్మరణీయం

Aug 7 2026 12:20 AM | Updated on Aug 7 2026 12:20 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/భద్రాచలం: తెలంగాణ సాధనలో ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ అంకిత్‌, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌, ఎస్పీ బి.రోహిత్‌రాజు, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్‌, ఐటీడీఏ, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించారు. జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆయన చూపిన మార్గం, ఆలోచనలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొని ప్రొఫెసర్‌ జయశంకర్‌కు నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement