భూసార పరీక్షలతో మెరుగైన ఫలితం | - | Sakshi
Sakshi News home page

భూసార పరీక్షలతో మెరుగైన ఫలితం

Jul 25 2026 1:05 AM | Updated on Jul 25 2026 1:05 AM

జూలూరుపాడు/చండ్రుగొండ: ప్రతీ రైతు భూసార పరీక్ష చేయించి వచ్చే నివేదిక ఆధారంగా పంటల ఎంపిక, ఎరువుల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని హైదరాబాద్‌లోని భారతీయ వరి పరి శోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్‌ కవిరాజు, హైదరా బాద్‌ ఫార్మర్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌పీఓ) నిపుణురాలు అరుంధతి సూచించారు. జూలూరుపాడు, చండ్రుగొండ మండలం గానుగపాడులో శుక్రవా రం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈసందర్భంగా వారు పలువురు రైతుల భూమిలో పరీక్షలు చేసి లోపాలు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అంతేకాక రైతులకు ఉచితంగా మట్టి నమూనాల పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. కాగా, వరి సాగుచేసే రైతులు కరివేద విధానం పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందొచ్చని చెప్పా రు. ఈకార్యక్రమాల్లో సొసైటీల చైర్మన్లు కొమ్మినేని పాండురంగారావు, చెవుల చందర్‌రావు, సీఈఓలు శివ, లంకా నర్సింహారావు, డైరెక్టర్లు రెడ్డిబోయిన రాము, లకావత్‌ హేమ్లా, భూక్యా జవహర్‌లాల్‌, శీరంశెట్టి రామారావు, పాపిన్ని వెంకయ్య, మనుబోలు తిరువెంగళరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement