ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలి

Jul 25 2026 1:05 AM | Updated on Jul 25 2026 1:05 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఎల్‌నినో ప్రభావం కారణంగా వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి శుక్రవారం ఆయన పంటల వైవిధ్యీకరణ, సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్‌ పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి వీసీకి అదనపు కలెక్టర్‌ విద్యాచందన హాజరుకాగా.. ఆ ఆతర్వాత ఆమె అధికారులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లాలో పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, కనీస మద్ధతు ధర(ఎంఎస్పీ)పై స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మిషన్‌ భగీరథ ఈఈ నళిని తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement