చర్ల: మండలంలోని కొయ్యూరులో మంగళవారం రాత్రి భారీ కొండ చిలువ సంచరించింది. గ్రామంలోని ఇర్పా ప్రసాద్ ఇంటి సమీపంలో ఈ కొండచిలువ సంచరిస్తుండంతో గుర్తించిన ఆ కుటుంబీకులు, ఇరుగుపొరుగు వారికి తెలియజేయడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చా రు. సుమారు 20 అడుగుల పొడవు కలిగిన ఈ కొండ చిలువ ఏదో చిన్న జంతువును తినడంతో కదల లేని స్థితిలో ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. అకస్మాత్తుగా గ్రామంలో భారీ కొండచిలువ కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.


