క్రీడలతో ఒత్తిడిని అధిగమించవచ్చు | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఒత్తిడిని అధిగమించవచ్చు

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

పాల్వంచరూరల్‌: క్రీడా సాధన ద్వారా ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించవచ్చని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌ అన్నారు. కిన్నెరసాని స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఆదివారం ఐటీడీఏ ఉద్యోగులు ఫ్రెండ్రీ క్రికెట్‌ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. దమ్మపేట, భద్రాచలం, ఇల్లెందు డివిజన్‌ జట్లు పోటీపడగా, పీఓ నాయకత్వం వహించిన దమ్మపేట జట్టు ప్రథమ బహుమతిని గెలుచుకుంది. విజేత జట్టుకు షీల్డ్‌ అందజేశారు. కాగా ఫైనల్‌ మ్యాచ్‌లో పీఓ బ్యాంటింగ్‌ చేసి 29 పరుగులతో అజేయంగా నిలవడంతోపాటు బౌలింగ్‌లో రెండు వికెట్లు తీశాడు. భద్రాచలం జట్టులో జ్యుడీయల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ శివనాయక్‌ కూడా ఉన్నారు. ఈకార్యక్రమంలో స్కూల్‌ హెచ్‌ఎం చందు, పీడీ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

భద్రగిరి మార్ట్‌ను సందర్శించిన ఐటీడీఏ పీఓ

భద్రాచలంటౌన్‌: పట్టణంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భద్రగిరి మార్ట్‌ను పీఓ బి.రాహుల్‌ తన సతీమణితో కలిసి శనివారం రాత్రి సందర్శించారు. మార్ట్‌కు వచ్చే కస్టమర్లతో మర్యాదగా నడుచుకోవాలని, గిరిజన మహిళలు తయారు చేసిన ఆర్గానిక్‌ ఆహార పదార్థాలు, అటవీ ఉత్పత్తుల వివరాలను వారికి వివరిస్తూ విక్రయాలు పెంచాలని సిబ్బందికి సూచించారు. మార్ట్‌ సిబ్బంది ఝాన్సీ లక్ష్మి, భూదేవి, రమ్య, శశికళ, భవ్య, శివ తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement