అటవీ ఉత్పత్తుల ప్రస్తుత,
ప్రతిపాదిత ధరలు (కేజీకి రూ.ల్లో)
ప్రతిపాదనలు పంపాం
పాల్వంచరూరల్: రెండేళ్లుగా కలపయేతర అటవీ ఉత్పత్తులకు ఆశించిన ధరలు లేకపోవడంతో గిరిజ నులు సేకరణపై ఆసక్తి చూపడంలేదు. దీంతో అటవీ ఉత్పత్తుల సేకరణ తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో పది రకాల అటవీ ఉత్పత్తుల ధరలు పెంచాలని జీసీసీ ప్రతిపాదనలు పంపింది. ధరలు పెరిగితే గిరిజనుల కష్టానికి ఫలితం దక్కే అవకాశం ఉంది. జిల్లాలో కలపయేతర అట వీ ఉత్పత్తుల సేకరణపై వందల మంది గిరిజనులు ఆధారపడి ఉన్నారు. అటవీ ఉత్పత్తులను సేకరించి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సేల్స్ డిపోల్లో విక్రయిస్తూ, కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాగా, పలు ఉత్పత్తులకు ప్రతిపాదనలు పంపగా, తేనె, మారేడు గడ్డలు, అడవి చీపుర్లు, బంక తదితర ఉత్పత్తులకు ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తోంది. అధికారులు స్పందించి అన్ని ఉత్పత్తులకు ప్రతి పాదనలు పంపాలని గిరిజనులు కోరుతున్నారు.
గచ్చకాయలు
ఇప్పబద్ద
కరక్కాయలు
అటవీ ఉత్పత్తి ప్రస్తుత ప్రతిపాదిత
ధర ధర
ఇప్పబద్ద 29 50
ఇప్పపువ్వు 30 70
ముష్టిగింజలు 75 130
కుంకుడుకాయలు 40 80
చింతపండు 40 120
నరమామిడిచెక్క 32 60
కానుగ గింజలు 10 40
చిల్లిగింజలు 35 60
గచ్చకాయలు 40 70
కరక్కాయలు 15 40
10 రకాల ఉత్పత్తుల రేటు పెంపునకు
జీసీసీ ప్రతిపాదనలు
జిల్లాలో అధికంగా సేకరణ జరిగే 10 కలపయేతర అటవీ ఉత్పత్తులకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను ఆధారంగా ధరల పెంపునకు ప్రతిపాదనలు పంపించాం. వీటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా గిరాకీ ఉంది. ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే అమలు చేస్తాం. – సమ్మయ్య, గిరిజన సహకార సమితి డీఎం


