పాల్వంచ: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం ఓ దాత రూ.లక్ష నగదు అందించి ఔదార్యం చాటుకున్నారు. శనివారం పట్టణంలోని గట్టాయిగూడెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదే ఏరియాకు చెందిన కాపా వెంకటేశ్వరరావు రూ.లక్ష నగదు విరాళం ఇచ్చారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కిలారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కిలారు శిరీష 15 బెంచీలను వితరణ చేశారు. ఈ సందర్భంగా కాపా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. అనంతరం పాఠశాల సిబ్బంది వారిని సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బత్తుల మధుచంద్, కాల్వ ప్రకాష్, కిలారు రామయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
15న బహిరంగ
వేలంపాటలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో ఈ నెల 15న బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు ఈఓ విజయ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త కాంప్లెక్స్‌లోని 1,2,8, షాపులు మూడు సంవత్సరాలకు వేలంపాట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాత కాంప్లెక్స్‌లోని 1,2 దుకాణాలు, చీరలు పోగు చేసేందుకునేందుకు, పూలదండలు, తలనీ లా లు పోగు చేసుకునేందుకు, ఫొటోలు తీసుకునేందుకు 11 నెలల కాలపరిమితితో లైసెన్స్ హక్కులు పొందేందు 15న టెండర్ కం బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని ఈఓ కోరారు.
సింగరేణి జీఎం సహా ముగ్గురికి షోకాజ్ నోటీసులు!
రుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం, పీవీకే–5 గని మేనేజర్, పీవీకే గని ఏజెంట్‌కు యాజమాన్యం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నెల 9న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తగూడెం ఏరియాలోని పీవీకే–5 గని ఆవరణలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత గని లోకి దిగి, కార్మికులతో పలు అంశాలు చర్చించారు. ముందస్తు అనుమతి లేకుండా గని ఆవరణలో కవిత పిట్ సమావేశం ఎలా నిర్వహించారని, ఆమెను గనిలోకి ఎలా అనుమతించారని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
కేజీబీవీ విద్యార్థులకు
నేడు ప్రవేశ పరీక్ష
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని కేజీబీవీల్లో చదివే ఆరో తరగతి విద్యార్థులకు ఆదివారం యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్షలెన్స్ ప్రవేశ పరీ క్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధి కారి డి.వాసంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష నిర్వహణకు జేఈఈ కోసం భద్రాచలం కేజీబీవీలో, నీట్, సీఎల్‌ఏటీ కోసం పాల్వంచ కేజీబీవీలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జేఈఈ శిక్షణ కోసం 35 మంది, నీట్ కోసం 75 మంది, సీఎల్‌ఏటీ కోసం 37 మంది విద్యార్థులు హాజరు కానున్నరని తెలిపారు.
ప్లాంటేషన్‌ను
పరిశీలీంచిన డీఎఫ్‌ఓ
చుంచుపల్లి: కొత్తగూడెం రేంజ్ పరిధిలో హేమచంద్రాపురం బీట్‌లో ప్లాంటేషన్‌ను శనివారం డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పరిశీలించారు. సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవులను కాపాడటం ప్రతీ ఒక్కరి బాధ్యతని అన్నారు. అటవీ ప్రాంతంలో చెట్లను నరకడం, వన్యప్రాణులను వేటాడటం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.
‘సర్’ వేగవంతం చేయాలి
మణుగూరు టౌన్: ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ను వేగంగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశించారు. శనివారం పట్టణంలోని ప్రధాన రహదారిపై జరుగుతన్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎల్‌ఓలు రోజుకు 30 నుంచి 50 వరకు దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, బీఎల్‌ఓలు ఉన్నారు.


