ఓం మహా ప్రాణ దీపం.. | - | Sakshi
Sakshi News home page

ఓం మహా ప్రాణ దీపం..

Feb 16 2026 7:27 AM | Updated on Feb 16 2026 7:27 AM

ఓం మహ

ఓం మహా ప్రాణ దీపం..

● వైభవంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం ● శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు ● గోదావరిలోని మోతెగడ్డకు పోటెత్తిన భక్తులు ● స్వామివార్లను దర్శించుకుని మొక్కుల చెల్లింపు కనకగిరి గుట్టలపై మంత్రి పొంగులేటి పూజలు

● వైభవంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం ● శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు ● గోదావరిలోని మోతెగడ్డకు పోటెత్తిన భక్తులు ● స్వామివార్లను దర్శించుకుని మొక్కుల చెల్లింపు

బూర్గంపాడు: పవిత్ర గోదావరి మధ్యలో వెలిసిన మోతెగడ్డ వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. బూర్గంపాడు మండలంలోని మోతె గ్రామం నుంచి పడవలలో నది మధ్యలోని వీరభద్రుని గుట్టకు చేరుకున్నారు. గోదావరి నదిలో నీళ్లు ఎక్కువగా ఉండటంతో పడవల ప్రయాణం ఆలస్యమైంది. దీంతో భక్తుల రాకపోకలకు కొంత ఇబ్బందులు తప్పలేదు. రద్దీ ఎక్కువ కావటంతో మధ్యాహ్న సమయంలో కొంతసేపు గోదావరి ప్రయాణాలను అధికారులు నిలిపివేశారు. భద్రాచలం వైపు నుంచి ఎటపాక మండలం చింతలగూడెం(చెన్నపట్నం) నుంచి రావాలని బూర్గంపాడు ఎస్‌ఐ మేడ ప్రసాద్‌ సూచించడంతో చాలామంది భక్తులు అటు నుంచే మోతెగడ్డకు చేరుకున్నారు. ఆలయంలో స్వామివారి దర్శనానికి సుమారు రెండుగంటల సమయం పట్టింది. భక్తులకు ఇబ్బందులకు కలగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. తహసీల్దార్‌ కేఆర్‌కేవీ ప్రసాద్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మండలంలోని నాగినేనిప్రోలు, బూర్గంపాడు, సారపాక, మోరంపల్లిబంజర గ్రామాల్లోని శివాలయాలు భక్తుల శివనామ స్మరణతో మార్మోగాయి. బూర్గంపాడు మండలానికి చెందిన పలువురు భక్తులు కాలినడక పెదరావిగూడెం కేదారేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. మోతెగడ్డ ఆలయంతోపాటు అన్నపురెడ్డిపల్లి మల్లికార్జునస్వామి ఆలయం, పాల్వంచ ఆత్మలింగేశ్వరాలయంలో భక్తుల సందడి నెలకొంది. శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించగా, భక్తులు తిలకించి తన్మయత్వం పొందారు. పలువురు జాగారం చేశారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌ పూజలు

శివరాత్రి సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌ దంపతులు ఆదివారం మోతెగడ్డలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ ఆలయాన్ని సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు.తహసీల్దార్‌ కేఆర్‌కేవీ ప్రసాద్‌, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ బాలయ్య, డిప్యూటీ తహసీల్దార్‌ సమ్మయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లి శైవక్షేత్రానికి పోటెత్తిన భక్తులు

పాల్వంచరూరల్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలోని శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు పద్మనాభశర్మ, రమేష్‌ శాస్త్రి స్వామివారికి గణపతి పూజ, అభిషేకం, అష్టోత్తర, రుద్రహోమం మృత్యుజయ హోమం జరిపారు. అనంతరం స్వామివారు, అమ్మవార్లకు కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ బానినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

చండ్రుగొండ: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు మండలంలోని బెండాలపాడు శివారు కనకగిరి గుట్టలపై వేంచేసి ఉన్న వీరభద్రుడిని ఆదివారం దర్శించుకున్నా రు. పూజలు నిర్వహించారు. అనంతరం మా ట్లాడుతూ వీరభద్రుడి ఆలయ అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. కాగా శివరాత్రి పర్వదినా న్ని పురస్కరించుకుని చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో గుట్టపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.

ఓం మహా ప్రాణ దీపం..1
1/2

ఓం మహా ప్రాణ దీపం..

ఓం మహా ప్రాణ దీపం..2
2/2

ఓం మహా ప్రాణ దీపం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement