రామయ్యకు స్వర్ణ పుష్పార్చన
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోనిస్వామివారి మూలమూర్తులకు ఆది వారం అభిషేకం, స్వర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవేతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్ర ధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిపారు.
వైభవంగా
గోదావరి హారతి
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని గోదావరి తీరంలో మహాశివరాత్రి పర్వదినాన భక్తి భావంతో ఉప్పొంగింది. ఆదివారం నదీ హార తి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకుడు రామవజ్జల రవికుమార్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య గోదావరికి అష్టోత్తర శతనామార్చన, దీపోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ ఈఓ దామోదర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. తహసీల్దార్ ధనియా ల వెంకటేశ్వర్లు, పురోహితులు సురేష్ వర్మ, పవన్ కుమార్ వర్మ పాల్గొన్నారు.
కిన్నెరసానిలో జలవిహారం
పాల్వంచరూరల్: మహాశివరాత్రి సందర్భంగా పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో సందర్శకుల రద్దీ పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్, జలాశయాలను వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 358 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.19,270 ఆదాయం లభించింది. 190 మంది బోటింగ్ చేయడంతో రూ.11,850 ఆదాయం టూరిజం శాఖకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
విద్యా వ్యవస్థలో
విప్లవాత్మక మార్పులు
మధిర: భవిష్యత్‌లో ప్రభుత్వ పాఠశాలలో చదవడం తమ అదృష్టంగా విద్యార్థులు భావించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిరలోని తేళ్ల వసంతయ్య మెమోరియల్ (టీవీఎం) ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం 48వ వార్షిక సమ్మేళనం ఆదివారం నిర్వహించగా, భట్టి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 48వ వార్షిక సంచికను ఆవిష్కరించిన ఆయన, విద్యారంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను వివరించారు. అత్యాధునిక వసతులతో పాఠశాలలను పునర్నిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం భవనాలు మాత్రమే కాదని, అవి విజ్ఞాన కేంద్రాలని అన్నారు. బడ్జెట్‌లో విద్యకు పెద్దపీట వేస్తూ, ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, డిజిటల్ విద్యా విధానం, తరగతి గదుల నిర్మాణం, తాగునీటి వసతి, బాలికలకు ప్రత్యేక వసతులు, లైబ్రరీ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచ దేశాలతో పోటీపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలను అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నామని వివరించారు. నాణ్యమైన విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, అందుకే ప్రజాప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.
రామయ్యకు స్వర్ణ పుష్పార్చన
రామయ్యకు స్వర్ణ పుష్పార్చన


