మూడేళ్లలో సీతారామ పూర్తి
రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి
రూ.100 కోట్లతో యాంత్రీకరణ
పథకంలో వ్యవసాయ పరికరాలు
దేశంలోనే రికార్డు స్థాయిలో
రాష్ట్రంలో వరి పంట సాగు
రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
అశ్వారావుపేటరూరల్: రానున్న మూడేళ్లలో సీతా రామ ప్రాజెక్ట్‌ను వందశాతం పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి గోదా వరి జలాలను పూర్తిస్థాయిలో అందిస్తామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్ట్ పేరుతో ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఒక్క ఎకరా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. శుక్రవారం అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన రైతు మేళా, అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంతోపాటు గడిచిన రెండేళ్లుగా అమలు కానీ యంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించామని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.100కోట్ల వ్యయంతో 1.30లక్షల మంది రైతులకు 50శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తామని చెప్పారు.
దేశంలోని 29రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 148లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాల న, ఉమ్మడి రాష్ట్రం హయాంలో కూడా లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరిసాగులో రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని అన్నారు. ప్రకృతి వ్య వసాయాన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పా రు. మంత్రి తుమ్మలవ ూట్లాడుతూ త్వరలోనే సీతా రామ 4వ పం్‌ప్‌హౌస్‌ను పూర్తిచేసి అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు కూడా గోదా వరి నీళ్లు అందిస్తామన్నారు. వచ్చేమూడేళ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ విస్తరిస్తామని తెలిపారు. 2047నాటికి 400 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని వ్యవసాయ రంగం ద్వారా వచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేలు జారెఆదినారాయ ణ, తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, విశ్వవిద్యాలయం వీసీ ఆల్దాస్ జాన య్య, వ్యవసాయశాఖ కార్యదర్శి కె.సురేంద్రమో హన్, ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా, అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, కళాశాల ఏడీ హేమంత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మొగళ్లపు చెన్నకేశవరావు, బండి భాస్కర్ పాల్గొన్నారు.


