ప్రతీ హామీని అమలు చేశాం
పంచాయతీల తరహాలో
మున్సిపాలిటీల్లోనూ గెలిపించండి
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఇల్లెందు/పినపాక: ప్రజల దీవెనలతో ఏర్పడిన తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని, ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయడం వల్లే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 69 శాతం పంచాయతీల్లో విజయం సాధ్యమైందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే తీర్పు ఇవ్వాలని కోరారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు వార్డు సభ్యుల ఆత్మీ య సమ్మేళన కార్యక్రమాన్ని శుక్రవారం ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్ ఆవరణలో, పినపాకలో నిర్వహించారు. ప్రజాప్రతినిధులను సన్మానించాక మంత్రి మాట్లాడుతూ ప్రజా పాలనలోసర్పంచులు, వార్డు సభ్యులు కీలకమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి ద్వారానే ప్రజల వద్దకు చేరుతాయని అన్నారు. మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే మళ్లీ ఎన్నికలకు వస్తామని అన్నారు. మార్చి చివరి నాటికి రెండోదశ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లెందు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, జీఓ 76ను కూడా పరిష్కరిస్తామని తెలి పారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించాలని అన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఇల్లెందులో నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన సీతారామ ప్రా జెక్టు చేపట్టకుండానే మొండి చేయి చూపించారని విమర్శించారు. నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ నీళ్లు ఇస్తుందని, బడ్జెట్‌లో నిధులు కేటాయించేలా మంత్రి పొంగులేటి బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ఈ సభలో ఎమ్మెల్యేలు పాయంవెంకటేశ్వర్లు, జారే ఆది నారాయణ, తుళ్లూరు బ్రహ్మయ్య, మార్కెట్, ఆత్మ కమిటీల చైర్మన్లు బానోతు రాంబాబు, మంగీలాల్ నాయక్, కాంగ్రెస్ పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడుడానియేల్, సైదులు, దమ్మాలపాటి వెంకటేశ్వ రరావు, యదళ్లపల్లి అనసూర్య, మడుగు సాంబ మూర్తి, మండల రాము తదితరులు పాల్గొన్నారు.


