పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించా రు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచా మృతం, అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతో పాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీ కుమారి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఫ్రైడే డ్రైడే పాటించాలి
చుంచుపల్లి: ప్రతీ శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖఅధికారి డాక్టర్ తుకారం రాథోడ్ సూచించారు. శుక్రవారం కారుకొండ రామవరం యూఎఫ్‌డబ్ల్యూసీని సందర్శించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరి శీలించి మాట్లాడారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే గదిని పరిశీలించి, పలు సూచలను చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మోహన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
లేబర్ కోడ్‌లను
రద్దు చేయాలి
దమ్మపేట: కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్‌లు, విత్తన చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రం దమ్మపేట లో సీఐటీయూ మండల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. లేబర్ కోడ్‌లతో కార్మి కుల సంక్షేమం, హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని అన్నారు. ఉపాధిహామీ పథకం పేరును వీబీ రామ్‌జీగా మార్చడం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మధు, బ్రహ్మాచారి, రమేష్, పద్మ, పిట్టల అర్జున్, నబీ, రఘు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన ఫలితాలు సాధించాలి
కొత్తగూడెంఅర్బన్: ఇంటర్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా లెక్చరర్లు దృష్టి పెట్టాలని ఇంటర్మీడియట్ బోర్డు డిప్యూటీ సెక్రెటరీ రామచందర్ అన్నారు. శుక్రవారం ఆయ న కొత్తగూడెం జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాలలో అభివృద్ధి పనులు పరిశీ లించారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ల్యాబ్‌లలో సౌకర్యాలను తనిఖీ చేసి మాట్లాడారు. ఆ తర్వాత కళాశాలలో తెలంగాణ ప్రభు త్వ లెక్చరర్ అసోసియేషన్ క్యాలెండర్లను ఆవి ష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియ ట్ విద్యాశాఖాధికారి హెచ్.వెంకటేశ్వర్లు, జూని యర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఖుర్షిద్, బండి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ధనకొండ నరసింహారావు, కుమారస్వామి, ఆర్.చైతన్య తదితరులు పాల్గొన్నారు.
యోగాతో ఆరోగ్యం
పాల్వంచరూరల్: నిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చని బ్రహ్మకుమారీలు ప్రశాంతి, స్రవంతి అన్నారు. మండల పరిధిలోని బస్వతారాక కాలనీలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత మూడు రోజులుగా విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం బ్రహ్మకుమారీలు హాజరై విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. ఆసనాలు వేయించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్ కట్టా రవీంద్రబాబు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ కామేశ్వరరావు, సుధాకర్ పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం


