పునాదివరకు ఇళ్లు నిర్మించాక..
అశ్వాపురం: మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 18 మందిని అనర్హులుగా ప్రకటించారు. ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడంతో లబ్ధిదారులు పునాది వరకు నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో పునాది బిల్లుకు ప్రతిపాదనలు పంపి మంజూరు కోసం ఆశతో ఎదురుచూస్తుండగా, అర్హుల కాదంటూ తిరస్కరించారు. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అర్హుల ఎంపిక సమయంలో అద్దెకు ఉన్న భవనాల వద్ద ఫొటోలు దింపడంతో ఎల్–3 జాబితాలోకి పోయి అనర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అధికారులు, స్థాని క ఎమ్మెల్యే స్పందించి ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
అనర్హులుగా ప్రకటించిన లబ్ధిదారులు వీరే
ఇర్పా రవికుమార్, పాయం అమల(అమ్మగారిపల్లి), బల్లెం ఆదిలక్ష్మి, కె.సందీప్ (ఆనందాపురం), వంకాయలపాటి చాందిని, తురం రామలక్ష్మి(అశ్వాపురం), పాయం రోజా(చింతిర్యాలకాలనీ), గుంజాల సమ్మక్క, చెరుకు సోమయ్య(మల్లెలమడుగు), మడకం తిరుపతమ్మ(మనుబోతులపాడు), వేల్పుల లక్ష్మి(మిట్టగూడెం), తెల్లం తులసమ్మ, పొడియం నరసమ్మ (మొండికుంట), ఎలిగేటి స్నేహ, పొడిశెట్టి రజిత(నెల్లిపాక), తెల్లం రజిని(సండ్రలబోడు), చిలకా మమత(సీతరాంపురం), కోరెం సీత(వెంకటాపురం)
18 మంది ఇందిరమ్మ లబ్ధిదారులను
అనర్హులుగా ప్రకటన


