యాభై ఏళ్ల యాదిలో..
ఐదు దశాబ్దాలుగా
కిన్నెరసానిలో విద్యాబోధన
1975 నుంచి 2024 వరకు
40 బ్యాచ్‌లు
28న వేడుకలకు తరలిరానున్న
పూర్వవిద్యార్థులు
కిన్నెరసాని.. రాష్ట్రంలో పేరొందిన పర్యాటక ప్రాంతం. ఇక్కడ 50 ఏళ్ల క్రితం గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జూనియర్ కళాశాలగా ఉన్నతీకరించారు. వేల మంది గిరిపుత్రులు గురుకులం ఒడిలో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదిగారు. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులుగా దేశ, విదేశాల్లో పనిచేస్తున్నారు. ఈ నెల 28న స్వర్ణోత్సవాలు నిర్వహించనుండగా, వారంతా తరలిరానున్నారు. కొద్దిరోజులుగా పలువురు పూర్వ విద్యార్థులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. –పాల్వంచరూరల్
కిన్నెరసాని గురుకుల పాఠశాల్లో సీటు వచ్చిందటే ఆ రోజుల్లో ఆ విద్యార్థిని గొప్పగా చూసేవారు. ఇక్కడ చదివిన విద్యార్థుల తలరాతలతో పాటు చేతిరాతలు అద్భుతంగా మారాయి.
– నల్లాన్ చక్రవర్తుల చక్రవర్తి,
పూర్వ ఉపాధ్యాయుడు
స్కూల్ మొదటి బ్యాచ్ 1978లో 10వ తరగతి పూర్తి చేశా. నాగార్జున సాగర్‌లోని కాలేజీలో ఇంటర్మీడిఝెట్, వరంగల్ ఎన్‌ఐటీలో బీటెక్ చదివాను. ముంబైలో ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్‌గా పనిచేసి పదవి విరమణ పొందాను.
– పి.పిర్యానాయక్,
ఆదాయ పన్ను శాఖ రిటైర్డ్ కమిషనర్
కిన్నెరసాని గురుకులంలో 1979లో చదువుకున్నాను. ఇక్కడ చదివిన నాకు ఎంతో విజ్ఞానాన్ని అందించింది. నేడు ఒమన్ దేశం మస్కట్‌లో ఆపరేషన్, మెయింటెనెన్స్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. – గొంది సతీష్‌కుమార్, ఉద్యోగి
2000 సంవత్సరంలో ఇక్కడి గురుకులంలో పదో తరగతి చదివి ఉత్తీర్ణత సాధించిన నేను ఆతర్వాత ఉన్నత విద్యను అభ్యసించాను. ప్రస్తుతం ఇదే గురుకుల కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించడం సంతోషంగా ఉంది.
– గొగ్గెల రమేష్, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్
పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్నెరసాని డ్యామ్‌సైడ్‌లో 1975లో ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గిరిజన బాలుర రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశారు. ఏడాది తర్వాత పక్కా భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా 1976, డిసెంబర్ 25న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, సంజయ్‌గాంధీలు శంకుస్థాపన చేశారు. గురుకులంలో 50 ఏళ్ల కాలంలో ఒక్కో బ్యాచ్‌కు 80 మంది చొప్పున సుమారు 3,500 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఉన్నత విలువలతో కూడిన విద్యా బోధన అందించడంతో ఉన్నతస్థాయికి ఎదిగారు. దేశ, విదేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో స్థిరపడ్డారు. పలువురు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మస్కట్‌లో ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా పనిచేయడంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బ్యాంక్ మేనేజర్లు, టీచర్లు, పోలీసులుగా సేవలందిస్తున్నారు.
స్వర్ణోత్సవాలకు ఏర్పాట్లు..
గురుకుల పాఠశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు 3 వేల మంది పూర్వ విద్యార్థులు కలిసికట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పాఠశాల ప్రాంగణంలో సావనీర్, ఫొటో గ్యాలరీ, పూర్వ ఉపాధ్యాయులకు సత్కారం, లైబ్రరీ ఏర్పాటు కోసం పుస్తకాల సేకరణ, స్వర్ణోత్సవాల నిర్వహణకు నిధుల సేకరణ, 50ఏళ్ల స్మృతి పైలాన్, ఫొటో సెల్ఫీపాయింట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
స్వర్ణోత్సవాలకు సిద్ధమైన గిరిజన గురుకులం
యాభై ఏళ్ల యాదిలో..
యాభై ఏళ్ల యాదిలో..
యాభై ఏళ్ల యాదిలో..
యాభై ఏళ్ల యాదిలో..
యాభై ఏళ్ల యాదిలో..


