రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
జూలూరుపాడు: జూలూరుపాడు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం యానంబైలు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ తగిరష శివ(26) కొత్తగూడెం నుంచి ఆటోలో ప్రయాణికులను తీసుకొచ్చి, జూలూరుపాడులో దింపి వెనుదిరిగాడు. ఈ క్రమంలో భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో కొత్తగూడెం–తల్లాడ ప్రధాన రహదారిపై ఆటోను యూటర్న్ చేస్తుండగా ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలై శివ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కారు, బైక్ ఢీకొని వృదుడు..
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): కారు, బైక్ ఢీకొని వృద్ధుడు మృతి చెందగా, బాలుడు గాయపడ్డ ఘటన గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామంలో కూతురు వద్ద ఉంటున్న తండు వెంకటేశ్వర్లు (60) ద్విచక్రవాహనంపై భాస్కరాపురానికి చెందిన బాలుడిని బైక్‌పై లిఫ్ట్ ఎక్కించుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రాజాపురం నుంచి సత్తుపల్లి వైపు వెళుతున్న కారు కంపగూడెం గ్రామశివారులో ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. బాలుడికి చేయి విరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.
రామాలయ ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు రోశిరెడ్డి మృతి
బూర్గంపాడు: మండలంలోని సారపాకకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు ఎడమకంటి రోశిరెడ్డి గురువారం మృతి చెందారు. ఏపీలో విశాఖపట్టణానికి పని మిత్తం వెళ్లిన ఆయనకు అక్కడే గుండెపోటు రావడంతో కన్నుమూశారు. కాగా, టీపీపీసీ కార్యదర్శిగా వ్యవహరించిన రోశిరెడ్డి మృతిపై పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు.


