
● వ్యవసాయ కళాశాల డీన్‌కు..
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్‌కు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. ఇప్పటికే ఆయన జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు అందుకోగా, తాజాగా మరోసారి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యవసాయ విశ్వ విద్యాలయంలో గత 18 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న హేమంత్‌కుమార్.. 51 పరిశోధన పత్రాలు సమర్పించారు. దీంతో 2017 నుంచి 2023 వరకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో 31 అవార్డులు అందుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు పంటల సాగు, యాజమాన్య పద్ధతులు, వ్యవసాయ విస్తరణ సేవలు అందించడంతో పాటు వ్యవసాయ కళాశాలలో స్ఫూర్తిదాయకంగా బోధన చేస్తున్నారు. కాగా, హేమంత్‌కుమార్‌కు మరో అవార్డు రావడం పట్ల వ్యవసాయ కళాశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.