
కనీస వేతనాలు చెల్లించాలి
ఇల్లెందు: ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని సీఐటీయూ అనుబంధ తెలంగాణ రారష్ట్‌ర ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం ఇల్లెందులోని ఐతా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన యూనియన్ జిల్లా 4వ మహాసభలో ఆమె మాట్లాడారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని కోరారు. డబ్ల్యూహెచ్‌ఓ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఆశా వర్కర్ల సేవలు గుర్తించినా కేంద్ర ప్రభుత్వం సరైన గౌరవం కల్పించడంలేదని ఆరోపించారు. ప్రమాద బీమా సదుపాయం రూ.50 లక్షలు అందజేస్తామని ప్రకటించి జీఓ విడుదల చేయటం లేదని విమర్శించారు. తొలుత యూనియన్ నాయకులు చీమల రమణ సంఘం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాచారి, ఉపాధ్యక్షుడు ఎంవీ అప్పారావు, కోశాధికారి జి. పద్మ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యాదర్శి దుబ్బా ధనలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ, ఎస్‌ఏ నబీ, ఈసం వెంకటమ్మ, టి. కృష్ణ, సుల్తానా, వజ్జా సుశీల, హైమా, భాగ్య, విజయ, సుజాత, సుగుణ పాల్గొన్నారు.
ఆశా వర్కర్ల యూనియన్
రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి