ఎకో టూరిజం అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఎకో టూరిజం అభివృద్ధికి కృషి

Sep 7 2025 7:38 AM | Updated on Sep 7 2025 7:38 AM

ఎకో టూరిజం అభివృద్ధికి కృషి

ఎకో టూరిజం అభివృద్ధికి కృషి

పాల్వంచరూరల్‌ : కిన్నెరసాని అభయారణ్యంలో ఎకో టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) డాక్టర్‌ సువర్ణ అన్నారు. మండల పరిధిలోని కిన్నెరసానిని శనివారం సీసీఎఫ్‌ భీమానాయక్‌, డీఎఫ్‌ఓ జి.కిష్టాగౌడ్‌, వైల్డ్‌లైఫ్‌ ఎఫ్‌డీఓ బాబుతో కలిసి ఆమె సందర్శించారు. వాచ్‌టవర్‌, డీర్‌పార్కు, అద్దాలమేడ, కాటేజీలు, కిన్నెరసాని జలాశయం మధ్యలో ఉన్న ఆనందద్వీపాన్ని బోటులో వెళ్లి పరిశీలించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎకో టూరి జం అభివృద్ధి చేసి పర్యాటకులకు ఆహ్లాదంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రెక్కింగ్‌, సఫారీ టూర్‌ మ్యాప్‌ను సిద్ధం చేసి వారం రోజుల్లో పంపించాలని ఆదేశించారు.

అటవీ శాఖ సిబ్బంది క్వార్టర్లు ప్రారంభం

అశ్వాపురం: మండల పరిధిలోని మనుబోతులగూడెంలో నిర్మించిన అటవీ శాఖ సిబ్బంది క్వార్టర్లను పీసీసీఎఫ్‌ సువర్ణ ప్రారంభించారు. క్వార్టర్ల ఆవరణలో అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మనుబోతులగూడెంని ప్లాంటేషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో సీసీఎఫ్‌, డీఎఫ్‌ఓతో పాటు ఎఫ్‌డీఓ మక్సూద్‌, ఎఫ్‌ఆర్‌ఓ ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

అడవుల విస్తరణకు కృషి చేయాలి

భద్రాచలంటౌన్‌: నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో అడవుల విస్తరణకు కృషి చేయాలని పీసీసీఎఫ్‌ సువర్ణ అధికారులను ఆదేశించారు. భద్రాచలంలో శనివారం ఆమె సీసీఎఫ్‌ క్యాంప్‌ కార్యాలయాన్ని, దుమ్ముగూడెంలో క్వార్టర్లను ప్రారంభించారు. అనతరం టింబర్‌ డిపోతో పాటు నర్సరీని పరిశీలించి మాట్లాడారు. అడవుల సంరక్షణ బాధ్యత సిబ్బందిపై ఉందని, సమన్వయంతో విధులు నిర్వహించి వనాలను కాపాడాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీఓ సుజాత తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే వినతి..

మణుగూరు టౌన్‌: ఆళ్లపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు పినపాక మండలాల్లో ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సువర్ణను కోరారు. ఈ మేరకు మణుగూరులో శనివారం వినతిపత్రం అందించారు. రహదారులు లేక గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. ఆయన వెంట సింగరేణి ఏరియా జీఎం దుర్గం రాంచందర్‌ ఉన్నారు.

పీసీసీఎఫ్‌ సువర్ణ వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement