భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నేడు పర్ణశాల ఆలయం మూసివేత
దుమ్ముగూడెం : చంద్రగ్రహణం సందర్భంగా పర్ణశాల రామాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మూసివేస్తామని ఆలయ ఇన్‌చార్జ్ అనిల్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి సంప్రోక్షణ, వైదిక కార్యక్రమాల అనంతరం 7.30 గంటలకు దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
13న జాతీయ
లోక్ అదాలత్
పోలీసుల సూచనలు పాటించాలి : ఎస్పీ
గణేశ్ నిమజ్జనంలో
జాగ్రత్తలు పాటించాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం : గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా భక్తులు పలు జాగ్రత్తలు పాటించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ఐటీడీఏ కార్యాలయ సిబ్బంది క్వార్టర్ల వద్ద గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం న్నదాన కార్యక్రమం నిర్వహించగా పీఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ వేడుకలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. పోలీసులు, ఇతర అధికారులు సూచనలు పాటిస్తూ విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏటీడీఓ అశోక్ కుమార్, డీఈ హరీష్, టీఏ శ్రీనివాస్, ఆర్‌ఓఎఫ్‌ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, ఈఈ వెంకటస్వామి, డీడీ ప్రమీలాబాయ్ తదితరులు పాల్గొన్నారు.
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన