
గణంగా వీడ్కోలు !
గంగమ్మ ఒడికి చేరిన వినాయక విగ్రహాలు ● జిల్లాలో ఘనంగా నిమజ్జనోత్సవాలు
గోదావరిలో నిమజ్జనానికి లాంచీలో తరలిస్తున్న వినాయక విగ్రహాలు
నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. జిల్లా వ్యాప్తంగా శనివారం గణపతి శోభాయాత్రలు, నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శోభాయాత్రను ప్రారంభించగా.. పలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. భద్రాచలం వద్ద వినాయక నిమజ్జనోత్సవాలను ఎస్పీ రోహిత్‌రాజుతో పాటు పలువురు అధికారులు పరిశీలించి భక్తులకు సూచనలు చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి 8 గంటల వరకు గోదావరిలో 1091 విగ్రహాలను నిమజ్జనం చేయగా, అర్ధరాత్రి దాటాక కూడా వేడుక కొనసాగింది. ఆదివారం చంద్రగ్రహణం ఉండడంతో కొందరు సోమవారం కూడా నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే జిల్లాలో ప్రతిష్ఠించిన వాటిలో అత్యధిక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శనివారమే పూర్తయింది. – భద్రాచలంఅర్బన్/కొత్తగూడెంటౌన్