
అన్నదాతకు తప్పని పాట్లు
అశ్వాపురం/టేకులపల్లి : రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. విక్రయ కేంద్రాల వద్ద బారులుదీరడం తప్పడం లేదు. అశ్వాపురం మండలం నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద శనివా రం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కట్టారు. ఒక్కొక్కరికి రెండు బస్తాలు మాత్రమే విక్రయించడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అందరికీ సరిపోక కొందరు నిరాశగా వెనుదిరిగారు. టేకులపల్లి పీఏసీఎస్‌కు కూడా రైతులు భారీగా చేరుకుని క్యూలో నిల్చున్నారు. మధ్యాహ్నం భారీ వర్షం పడగా, కార్యాలయ వరండాలో నిల్చోవాలని అధికారులు సూచించారు. దీంతో వరుస క్రమం తప్పగా రైతుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసులు చేరుకుని రైతులను శాంతింపజేశారు.
యూరియా కోసం అవే బారులు

అన్నదాతకు తప్పని పాట్లు