
ఆధునిక పద్ధతుల్లో సాగు చేయాలి
అశ్వారావుపేటరూరల్/మణుగూరురూరల్ : ఆధునిక సాంకేతిక విధానంలో పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలను శనివారం ఆయన సందర్శించారు. బోధన సిబ్బందితో మాట్లాడి వ్యవసాయ కోర్సులు, ఉన్నత విద్య తదితర అంశాలపై ఆరా తీశారు. ఉద్యానతోటల్లో అంతర పంటల సాగు, పంటల వైవిధ్యం, నూతన సాంకేతికతతో విద్యార్థులకు బోధన, మామిడి దేశ, విదేశీ వంగడాలు, కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జ్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఐ.వి. శ్రీనివాసరెడ్డి, ఏఓ శివరామ ప్రసాద్, ఏఈఓ ఆరేపల్లి సతీష్, బోధన సిబ్బంది రాంప్రసాద్, కె. శిరీష, టి. శ్రావణ్‌కుమార్, స్రవంతి, జాంబమ్మ, జెమీమ, దీపక్‌రెడ్డి పాల్గొన్నారు.
పంటల సాగుపై సమీక్ష
మణుగూరు మండలం గుట్టమల్లారం రైతు వేదికను సౌరభ్ శర్మ శనివారం సందర్శించారు. రైతువేదిక ప్రాంగణంలో మొక్క నాటిన తర్వాత పంటల సాగు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతపై అధికారులతో చర్చించారు. పంటల నమోదు, పంట కోత ప్రయోగాలు, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, బయో చార్కోల్, కంపోస్ట్ ఎరువు తయారీ, మునగ సాగు తదితర అంశాలను అధికారులు ఆయనకు వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ బి.తాతారావు, ఏఓలు వెంకటేశ్వర్లు, చటర్జీ, రాహుల్‌రెడ్డి, ఏఈఓలు కొమరం లక్ష్మణ్‌రావు, నాగేశ్వరరావు, హారిక, రమేష్, రమాదేవి, సౌమ్య, సిబ్బంది సత్యనారాయణ, లక్ష్మీదేవి పాల్గొన్నారు.
ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ