
ఆయిల్‌ఫెడ్ రికార్డ్!
అశ్వారావుపేటరూరల్: రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్ తోటల సాగు విస్తరిస్తోంది. ఈ ఏడాది తోటల నుంచి గెలల దిగుబడి మొదలైన నేపథ్యంలో గతంలో నమోదైన రికార్డులను సైతం అధిగమిస్తోంది. రాష్ట్రంలోని 8 జిల్లాలతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు ముదురు, లేత పామాయిల్ తోటల నుంచి దిగుబడి పెరిగింది. అశ్వారావుపేట, దమ్మపేట మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలకు జూలైలో 38,341.100 మెట్రిక్ టన్నులు రాగా, ఆగస్టులో 9,291.135 మెట్రిక్ టన్నుల గెలలు వచ్చాయి. రెండు నెలల్లో మొత్తం 47,632.235 మెట్రిక్ టన్నుల గెలలు ఫ్యాక్టరీకి చేరాయి. గతేడాది ఇదే కాలంలో 35,810 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. గతంకంటే ఈ సారి దిగుబడి భారీగా పెరగడంతో కొత్త రికార్డు సృష్టించినట్లయింది.
పెరగనున్న గెలల ధర?
పామాయిల్ టన్ను గెలల ధర మరోసారి స్వల్పంగా పెరగనున్నట్లు తెలిసింది. గత నెలలో టన్ను రూ.18,052 ఉండగా, తాజాగా రూ.1000లోపు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల కంటే ముడి పామాయిల్ టన్ను ధరతోపాటు గెలల దిగుబడి పెరగడంతో ఆగస్టు నెలకు సంబంధించి టన్ను ధర పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పెంపునకు సంబంధించిన జీఓ సోమవారం జారీ కానున్నట్లు తెలిసింది.
గతేడాది కంటే అధికంగా
ఆయిల్‌పామ్ గెలల దిగుబడి