
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
బూర్గంపాడు: వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాప్తి చెందుతున్నందున ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. బూర్గంపాడు మండలం ఉప్పుసాకలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, ఒడ్డుగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డార్మెటరీ హాళ్లు, డైనింగ్ హాళ్లు, వంట గదులు, సామగ్రిని పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు మెనూ ప్రకారంపరిశుభ్రమైన పౌష్టికాహారం అందిస్తూ ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు, వార్డెన్లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంటే మెడికల్ క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. కాగా, ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెడికల్ క్యాంపు వివరాలు, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్‌ఓకు సూచించారు. ఒడ్డుగూడెం జీపీఎస్‌లో తనిఖీ సందర్భంగా ఉద్దీపకం వర్క్‌బుక్–2 ఆధారంగా బోధనపై పీఓ రాహుల్ ఆరా తీశారు.
భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్