
బియ్యంతో పాటు సంచులు..
పాల్వంచరూరల్ : బియ్యం కోసం రేషన్ షాపులకు వెళ్లేవారు ఇకపై బస్తాలు, సంచులు తీసుకెళ్లాల్సిన పని లేదు. వచ్చే నెల నుంచి ప్రభుత్వమే ఉచితంగా సంచులు సరఫరా చేస్తుంది. ఈ మేరకు సంచిపై ‘అందరికీ సన్నబియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అని రాయడంతో పాటు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కల ఫొటోలు ముద్రించి సిద్ధంగా ఉన్నాయి. 13 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా సంచులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం అందించే సంచి ఒక్కోటి రూ.50 విలువ చేస్తుందని చెబుతున్నారు. జిల్లాలోని వినియోగదారుల కోసం 2.93 లక్షల బ్యాగులు రాగా, గోదాముల్లో నిల్వ చేశారు.
జిల్లాలో పంపిణీకి సిద్ధంగా
2.93లక్షల బ్యాగులు