
వైద్యసేవలు మెరుగుపర్చాలి
బూర్గంపాడు: మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు మరింతగా మెరుగుపర్చాలని అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ సూచించారు. మోరంపల్లిబంజర పీహెచ్‌సీని, లక్ష్మీపురం ఆరోగ్య ఉపకేంద్రాన్ని, దేవగుంపు గొత్తికోయ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. పీహెచ్‌సీలు, హెల్త్ సబ్‌సెంటర్లలో అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లతో మాట్లాడుతూ.. గ్రామాల్లో వైద్యసేవలు ఎలా అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. దేవగుంపులో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ప్రభుత్వపరంగా వైద్యసేవలు అందించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వైద్యారోగ్యశాఖకు పటిష్టమైన వ్యవస్థ ఉందన్నారు. సీజనల్ వ్యాధులు గుర్తించడానికి కూడా ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు స్పందన, లక్ష్మీసాహితి, లలిత తదితరులు పాల్గొన్నారు.
అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ