
కేటీపీఎస్ ఆధునికీకరణకు ప్రోత్సాహకం అందించాలి
ఖమ్మంమయూరిసెంటర్: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) ఆధునికీకరణ, పాత ప్లాంట్ల పునరుద్ధరణకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చొరవ చూపాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో 820 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కేటీపీఎస్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా రెండు 800 మెగావాట్ల యూనిట్లుగా ఆధునికీకరణ చేపట్టాలని, ఇందుకు అవసరమైన బొగ్గు నిల్వలు, గోదావరి జలాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈమేరకు పాత థర్మల్ స్టేషన్లకు ఆర్‌అండ్‌ఎం వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో సహకారం అందించాలని ఎంపీ కోరారు.
పార్లమెంట్‌లో ఎంపీ రఘురాంరెడ్డి