
రాజకీయ లబ్ధి కోసమే హామీలు
భద్రాచలంటౌన్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ లబ్ధికోసమే విద్యారంగం అభివృద్ధి పేరుతో కొత్త హామీలు ఇస్తున్నారని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ పేర్కొన్నారు. పట్టణంలోని మాస్‌లైన్ కార్యాలయంలో పీడీఎస్‌యూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో రూ. లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు, కళాశాలలను నడిపిస్తూ ఫీజుల దోపిడీ చేస్తున్నా.. ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యాయని తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25 నుంచి 30 వరకు తెలంగాణ విద్యార్థి పోరు పేరుతో జీపు జాత నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో డివిజన్ కార్యదర్శి మునిగల శివప్రశాంత్, రామ్‌చరణ్, పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు.
డీఈఈలు, ఈఈలకు
అదనపు బాధ్యతలు
ఖమ్మంఅర్బన్: జల వనరుల శాఖలో ఖాళీగా ఉన్న స్థానాల్లో డీఈఈలు, ఈఈలకు అదనపు బాధ్యత లు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43 మందికి అదనపు బాధ్యతలు కేటాయించగా జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఉన్నారు. తిరుమలాయపాలెం డీఈఈ రమేశ్‌రెడ్డికి పాలేరు ఈఈగా, ఖమ్మం సీఈ కార్యాలయంలో డీఈ కె.శోభారాణికి అదే కార్యాలయంలో డీసీఈగా అదనపు బాధ్యత లు అప్పగించారు. అలాగే, సత్తుపల్లి ఈఈ ఎస్.శ్రీనివాస్‌రెడ్డికి కల్లూరు డీఎస్‌ఈగా, మధిర డీఈఈ రాంప్రసాద్‌కు మధిర ఈఈగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. అంతేకాక భదాద్రి జిల్లా కొత్తగూడెం ఈఈ బి.అర్జున్‌కు ఆ జిల్లా డీసీఈగా, ఇల్లెందు డీఈఈ బి.కృష్ణకు ఇల్లెందు ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
జాతీయస్థాయి
పోటీలకు ఎంపిక
పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసాని గిరిజన క్రీడాపాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు వై.రుషివర్మ, కె.వెంకన్నబాబు హైదరాబాద్‌లో జరిగిన వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చూపారు. ఈ నెల 26, 27 తేదీల్లో పుణేలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం చందు తెలిపారు. ఇందులో విజయం సాధిస్తే ఇండియా జట్టు నుంచి చైనాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
ప్రతిభ చూపాలి
గిరిజన క్రీడాపాఠశాలకు చెందిన విద్యార్థులు క్రీడలతోపాటు చదువులో కూడా ప్రతిభ చూపాలని హెచ్ ఎం చందు ఆకాంక్షించారు. మండలంలోని గిరిజన క్రీ డా పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లోబంగారు పతకాలు సాధించగా బుధ వా రం వారిని అభినంధించారు. కార్యక్రమంలో వార్డెన్ పోలేబోయిన వెంకటేశ్వర్లు, పీడీలు బాలసుబ్రహ్మణ్యం, పీఈటీ దొడ్డ అంజయ్య, కోచ్ వాసు, సపవాత్ బాలు, స్వరూపారాణి, బట్టు శంకర్, పద్మావతమ్మ, బాలు, భగవాన్‌దాస్, కోటేశ్వరరావు, రామ్‌ధన్, విజయమ్మ, సుక్యా, వెంకన్న, భాస్కర్ పాల్గొన్నారు.
సీపీఎస్ ఈయూ ఆధ్వర్యాన నేడు ముఖాముఖి
ఖమ్మంసహకారనగర్: వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా విధులు నిర్వర్తించి ఇతర శాఖలకు కేటాయించిన వారితో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీజీ సీపీఎస్ ఈయూ) ఆధ్వర్యాన గురువారం ఇతర ముఖాముఖి నిర్వహించనున్నా రు. ఉదయం 9 గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్‌లో, మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం కలెక్టరేట్‌లో, ఆ తర్వాత ఖమ్మం ఆర్డీఓ కార్యాలయంలో ముఖా ముఖి ఉంటుందని జీపీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశాల్లో టీజీఈ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, టీజీసీపీఎస్ ఈయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.రామకృష్ణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దర్శన్‌గౌడ్, నాగవెల్లి ఉపేందర్ పాల్గొంటారని వెల్లడించారు.

రాజకీయ లబ్ధి కోసమే హామీలు

రాజకీయ లబ్ధి కోసమే హామీలు