
నిధులు లేక.. ‘ప్రగతి’ సాగక..
ఆగిన నిధుల వివరాలిలా..
2023 ఏప్రిల్ నుంచి నిలిచిన నిధులు కేవలం ఆర్థిక సంఘం నిధులే దిక్కు..
వేతనాల కోసం పాట్లు..
ఇల్లెందు: పట్టణాలను అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన పట్టణ ప్రగతికి 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా అభివృద్ధి ఆగిపోయింది. గత ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ప్రతీ మున్సిపాలిటీకి జనాభా ఆధారంగా నిధులు మంజూరు చేయగా.. శానిటేషన్ పనులు ముమ్మరంగా సాగాయి. ప్రారంభంలో ఇల్లెందు మున్సిపాలిటీకి రూ. 25 లక్షలు నిధులు కేటాయించారు. 2023 ఏప్రిల్ నుంచి నిధులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి మున్సిపాలిటీలు అస్తవ్యస్తంగా మారాయి.
ప్రతి నెలా నిధులతో ఇలా..
పట్టణ ప్రగతి ప్రణాళికలు రూపొందించి పట్టణంలోని ప్రధాన కూడళ్ల అభివృద్ధి, హరితహారం, సెంట్రల్ లైటింగ్, డ్రెయినేజీలు, భవన నిర్మాణాలు, చిట్టడవులు, నర్సరీలు, చిల్డ్రన్ పార్క్‌లు, పట్టణ ప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛ ఆటోలు, ఫౌంటేన్, వెండర్ జోన్ల అభివృద్ధి పనులు చేపట్టారు.
అత్యధిక నిధులు కార్మికుల వేతనాలకే..
ఇల్లెందు వంటి మున్సిపాలిటీలో ఇతర ఆదాయాలు రాబడి లేనందున పాలన సాగడం కష్టంగా మారింది. ప్రతి నెలా మున్సిపాలిటీలో పని చేసే కార్మికులకు వేతనాల కోసం రూ. 25 లక్షల వరకు నిధులు అవసరమవుతున్నాయి. పట్టణంలో లైసెన్సులు, ఆస్తి పన్నులు, ఇతర ఆదాయాల ద్వారా సమకూరిన నిధులు కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి సరిపోతున్నాయి. ఇతర అభివృద్ధి పనులు ముందుకు సాగాలంటే పట్టణ ప్రగతి నిధులు, ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌డీఎఫ్, ఎమ్మెల్యే, ఎంపీల నిధులు విడుదల చేయాలని పట్టణాల ప్రజలు కోరుతున్నారు. కేవలం ఆర్థిక సంఘం నిధులు మినహా ఇతర ఏ నిధులూ విడుదల చేయకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి.
పట్టణాల్లో కుంటుపడుతున్న అభివృద్ధి
2023 ఏప్రిల్ నుంచి నిలిచిన నిధులు కేవలం ఆర్థిక సంఘం నిధులే దిక్కు..
కార్మికుల వేతనాలకే
సరిపోతున్న మున్సిపల్ ఆదాయం
ఆగిన నిధుల వివరాలిలా..
మున్సిపాలిటీ నిధులు(రూ.లక్షల్లో)
ఇల్లెందు రూ. 12,00,743
ఖమ్మం రూ.1,02,30,766
సత్తుపల్లి రూ.12,21,197
మధిర రూ.12,53,413
వైరా రూ.12,25,778
కొత్తగూడెం రూ.28,00,097
మణుగూరు రూ.12,23,162
పాల్వంచ రూ.30,60,485
వేతనాల కోసం పాట్లు..
మున్సిపాలిటీలో కార్మికుల వేతనాలు వెళ్లదీయడం కోసం పాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు నేరుగా అందజేస్తే ఇక్కడి పన్నుల మీద వచ్చే ఆదాయంతో పట్టణంలో ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉండేది. నిధులు లేని కారణంగా ఏ పనీ సక్రమంగా చేయలేకపోతున్నాం. పట్టణ ప్రగతి నిధులు విడుదలైతే ఎంతో మేలు జరిగేది.
– సీహెచ్.శ్రీకాంత్, ఇల్లెందు మున్సిపల్ కమిషనర్

నిధులు లేక.. ‘ప్రగతి’ సాగక..