
టేబుల్ టెన్నిస్ ఉమ్మడి జల్లా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ జట్లను ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సోమవారం ఎంపిక చేశారు. ఈమేరకు జట్ల వివరాలను టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్‌కుమార్, వీవీఎస్.సాంబమూర్తి తెలిపారు. అండర్–11 బాలుర జట్టులో అనుమోలు శ్రేయన్, జాయ్, ఈశ్వర్, హేమంత్ సాయి, నిహాల్ కృష్ణ, యశ్వంత్, రోషన్, బాలికల జట్టుకు బాలసాని హర్వికలక్ష్మి, పి.ఆరాధ్య, తోట జిజ్ఞాస, రోస్మిత, అండర్–13 బాలికల జట్టులో పర్స వంషిక, బాలసాని తన్మయిశ్రీ, బొంతు సాయిశివాని, బాలుర జట్టులో కోటగిరి హితేష్ శ్రీరంగా, ఈ.హరి, అభిలాష్, అన్వేష్, సాయి హర్షిత్ ఎంపికయ్యారని వెల్లడించారు. అలాగే, అండర్–15 బాలికల జట్టులో హర్షిత, అఖిల, స్పందన చంద్ర, చిలకబత్తిన పావని, బాలురు జట్టుకు షేక్ సాహెల్ ఫజల్, జి.చార్విక్, ఈ.తరుణ్, ఏ.ఉజ్వల్, ప్రజ్ఞ, అండర్–17 బాలురు జట్టుకు పరిటాల జ్వలిత్, పిట్టల మోహిత్ కృష్ణ, రామ్ సాకేత్, రణధీర్‌రెడ్డి, సైఫ్, అనస్, బాలికల జట్టులో గద్దల సిరి, పి.అమత, జి.చంద్రికరాణి, షర్మిలరాణి, సుప్రియ ఎంపికయ్యారని తెలిపారు. ఆయా జట్లు ఈనెల 22నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొంటాయని వెల్లడించారు.
43 కిలోల గంజాయి సీజ్
భద్రాచలంటౌన్: ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్న గంజాయిని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ సీహెచ్ శ్రీహరిరా వు కథనం ప్రకారం.. భద్రాచలంలోని కూనవరంరోడ్డులో వా హనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేయగా 43 కిలోల గంజాయి లభించింది. దీంతో వాహనంలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఒడిశా రాష్ట్రం పాడువకు చెందిన సురేంద్ర సింగ్ రాజ్‌పుత్‌గా తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించారు. గంజాయి, కారును సీజ్ చేశారు. మరో ఘటనలో ద్వికచక్ర వాహనంపై 13 లీటర్ల నాటు సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇసుక లారీ సీజ్
దమ్మపేట: ఆంధ్రా నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్ప ర్ లారీని దమ్మపేట పోలీసులు సోమవారం సీజ్ చేశారు. ఏపీలోని రాజమండ్రి నుంచి టిప్పర్ ద్వారా దమ్మపేటకు తరలించి, ఓ ఖాళీ ప్రదేశంలో ఇసుక అన్‌లోడ్ చేస్తుండగా పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసునమోదు చేసినట్లు అదనపు ఎస్సై బాలస్వామి తెలిపారు.

టేబుల్ టెన్నిస్ ఉమ్మడి జల్లా జట్ల ఎంపిక