మట్టి తవ్వకాల్లో జేసీబీ బోల్తా
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామ శివారు పట్టా భూమిలో అనధికారికంగా చేపట్టిన మట్టి తవ్వకం పనుల్లో శనివారం జేసీబీ బోల్తా పడింది. కొమరారం గ్రామానికి చెందిన పాష తన సొంత పొలంలో చేపల పెంపకం పేరుతో సుమారు రెండు గుంటల విస్తీర్ణంలో మొరం తవ్వకం ప్రారంభించాడు. మట్టి తవ్వకాలు మరీ లోతుగా ఉండటం కారణంగా జేసీబీ తవ్వకం పనుల కోసం లోనికి దిగుతుండగా అదుపు తప్పి పల్టీకొట్టింది. డ్రైవర్ ప్రమాదాన్ని ముందే గుర్తించి దూకడం ద్వారా క్షేమంగా బయటపడ్డాడు. ప్రమాదంలో జేసీబీ కొంత మేర ధ్వంసమైంది.


