బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై నిఘా | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై నిఘా

Apr 17 2025 12:31 AM | Updated on Apr 17 2025 12:31 AM

బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై నిఘా

బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై నిఘా

కొత్తగూడెంటౌన్‌: క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో బుధవారం జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత నేరస్తులపైనా దృష్టి సారించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి వారిపై చర్య తీసుకోవాలని అఽధికారులను ఆదేశించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా పెండింగ్‌ కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ భాద్యతగా పని చేయాలని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరస్తులకు శిక్షపడేలా పని చేయాలన్నారు. పెట్రోల్‌ బ్లూకోల్డ్స్‌ వాహనాలు నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్‌ 100 కు ఫోన్‌ రాగానే ఘటనా స్థలానికి చేరుకోవాలని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని అన్నారు. జిల్లా ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం గత నెలలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్‌, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ డీఎస్పీలు అబ్దుల్‌ రెహమాన్‌, చంద్రభాను, సతీష్‌కుమార్‌, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్‌, ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజురెడ్డి, సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ రోహిత్‌రాజు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement