అశ్వారావుపేటరూరల్: కబేళాకు తరలిస్తున్న పశువులను మంగళవారం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురం సంత నుంచి డీసీఎం వ్యాన్‌లో అనుమతి లేకుండా 40 ఎద్దులు, 32 ఆవులను హైదారాబాద్‌లోని కబేళాకు తరలిస్తుండగా అశ్వారావుపేటలోని రింగ్ రోడ్ సెంటర్‌లో పట్టుకున్నారు. వ్యాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి, పార్వతీపురానికి చెందిన కె.అంజి, గుబ్బల ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పశువులను ఏపీలోని రాజమండ్రి గోసంరక్షణ కేంద్రానికి తరలించి, వ్యాన్‌ను సీజ్ చేశామని చెప్పారు.